సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారు – గిడుగు రుద్రరాజు

-

సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు. ఎంఎల్ఏ లను, ఎంపీలను స్ధానాలను మారిస్తే, ఒకచోట చెల్లనిది మరో చోట ఎలా చెల్లుబాటు అవుతుంది…బలహీనవర్గాల నాయకులను తక్కువ చేయడానికే ఈ మార్పులు చేస్తున్నారని ప్రశ్నించారు. బిసి కార్పొరేషన్ల చైర్మన్ల కు ఎలాంటి అధికారాలు లేకుండా చేసారు…టిడిపి ఇద్దరితోనే నడుస్తోంది… వైసీపీ కార్యవర్గ సమావేశం ఎప్పుడు జరిగిందో తెలీదని ఎద్దేవా చేశారు.

gidugu rudraraju comments on ycp

అందరూ రండి కలిసి పనిచేద్దాం… కాంగ్రెస్ నుంచీ అందరికీ పిలుపు అంటూ ప్రకటన చేశారు ఏపీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు. ఒంగోలులో యువభేరి నిర్వహించాం,ఒంగోలులో పాదయాత్ర, ర్యాలీ నిర్వహించామన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో యువత నిర్వీర్యం అయిపోయిందని ఫైర్‌ అయ్యారు. మత్తు పదార్ధాలు, గంజాయి అక్రమ రవాణా, సేద్యం మీద ఉక్కుపాదం మోపాల్సి ఉంది….25వేల కోట్ల రూపాయల మద్యం ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో అమ్ముడవుతోందని చెప్పారు ఏపీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు. పార్టీ నాయకుల మనోభావాలను మాణిక్కం ఠాకూర్ తెలుసు కున్నారు…జిల్లా కాంగ్రెస్ కమిటీలు, మండలాధ్యక్షులను నియమించుకున్నామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version