క‌రోనా పేషెంట్ల‌కు ఉచితంగా ఆహారం.. ఇంటికొచ్చి ఇస్తారు!

-

క‌రోనా సోకిన వారి బాధ‌లు అంతా ఇంతా కాదు. ఇక హైద‌రాబాద్ లో హోం ఐసోలేష‌న్ లో ఉంటున్న వారి గురించి అయితే చెప్ప‌క్క‌ర్లేదు. వండి పెట్టేవారు లేక‌, తాము వండుకోలేక నానా ఇబ్బందులు ప‌డుతున్న వారు ఉన్నారు. ఇలాంటి వారికి ఇప్ప‌టి వ‌ర‌కు కొన్ని స్వ‌చ్ఛంద సంస్థ‌లు ముందుకొచ్చి భోజ‌న ఏర్పాట్లు చేస్తున్నాయి. కానీ అంద‌రికీ అందించ‌లేక‌పోతున్నారు. ఇలాంటి వారికోసం రాష్ట్ర పోలీసు శాఖ ఒక మంచి కార్య‌క్ర‌మం తీసుకొచ్చింది.

హోం ఐసో లేషన్‌లో ఉన్న వారి కోసం ఇంటి వద్దకే ఆహారాన్ని ఉచితంగా అందించేందుకు చర్య‌లు చేప‌ట్టారు. సేవా ఆహార్‌ పేరుతో సత్యసాయి సేవా సంస్థ, హోప్‌ స్వచ్ఛంద సంస్థతో కలిసి గురువారం నుంచి ఈ సేవ‌లు ప్రారంభించారు. ఇప్పుడున్న ఫుడ్ డెలివ‌రీ సంస్థ‌లు స్విగ్గీ, జొమాలో లాంటివి ఇందుకు స‌హ‌కారం అందిస్తున్నాయి. 7799616163 ఫోన్‌ నంబర్‌కు వాట్సాప్‌లో ఉదయం 7 గంటలలోపు ఆహారం కావాల‌ని మెసేజ్ చేస్తే వారే ఇంటికి తెచ్చి ఇస్తారు.

లేదంటే సేవా ఆహార్‌ యాప్‌ ద్వారా కూడా ఆహారాన్ని పొంద‌వ‌చ్చు. ఇలా రోజుకు 1000 నుంచి 2 వేల మందికి ఆహారాన్ని అందిస్తూ ఆదుకుంటున్నారు మ‌న పోలీసులు. ఇందులో ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులకు మొద‌టి ప్రాధాన్యం ఇస్తారు. ఈ కార్య‌క్ర‌మాలు విమెన్‌ సేఫ్టీ వింగ్‌ చీఫ్, ఏడీజీ స్వాతీ లక్రా, డీఐజీ బడుగుల సుమతి నిర్వ‌హిస్తున్నారు. వీరి ఆధ్వ‌ర్యంలోనే ఈ కార్య‌క్రమాలు కొన‌సాగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version