కళాకారులను కాపాడండి…సాయి చంద్ మృతిపై గద్దర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయి చంద్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన గద్దర్ అనంతరం.. మాట్లాడారు.సాయి చంద్… పాటల ఆత్మ అన్నారు గద్దర్. ప్రజల పాటకు పాదాభివందనం… సాయి చంద్ అనే పాట అట్టడుగు వర్గాల నుంచి వచ్చి తాను ఏడ్చినప్పుడు… బాధపడ్డప్పుడు వచ్చింది… పాట…అంటూ ఎమోషనల్ అయ్యారు గద్దర్.
విప్లవాల పాట తో సాయి చంద్ కళాకారుడు అయ్యాడని…. సాయి చంద్ పాటల ఆత్మ అంటూ వెల్లడించారు. సీఎం కెసిఆర్ , కేటీఆర్ BRS మంత్రుల్లారా… మీకు విజ్ఞప్తి.. కళాకారులకు ఇల్లు కావాలి, విద్యా , వైద్యం కావాలి అని అడిగారు సాయి చంద్ అంటూ గుర్తు చేశారు. గద్దర్ ప్రజా పార్టీ అని ఈమధ్యే మొదలు పెట్టాను… నేను అధికార పార్టీకి చెబుతున్నాను..కళాకారులను కాపాడండని డిమాండ్ చేశారు గద్దర్.