గుడ్ న్యూస్ : స్థిరంగా బంగారం ధరలు.. హైదరాబాద్​లో ఎంతంటే!

-

 

దేశంలో మరోసారి స్థిరంగా బంగారం ధరలు నమోదు అయ్యాయి. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.

ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51, 670 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47, 360 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా భారీగా తగ్గుదలను నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ. 400 తగ్గి రూ. 67, 000 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version