యాదాద్రిలో ప్రమాణం చేసినందుకే.. బండి సంజయ్ పదవి పోయింది – ఆలేరు ఎమ్మెల్యే

-

యాదాద్రిలో ప్రమాణం చేసినందుకే.. బండి సంజయ్ పదవి పోయిందని బండి సంజయ్ పై బీఆర్‌ఎస్‌ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత హాట్ కామెంట్ చేశారు. యాదాద్రి జిల్లా గుండాల మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ.. యాదాద్రి లో తిండి ప్రమాణం చేసాడు కాబట్టే బండి సంజయ్ బిజెపి అధ్యక్ష పదవి కోల్పోయాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మసీదులు తొవ్వుతా , గోరీలు తొవ్వుతా అంటే ఇలాగే ఉంటదని హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఇది ఇలా ఉండగా, తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికీ బండి సంజయ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా కేంద్ర ప్రభుత్వంపై బండి సంజయ్ అలిగినట్లు తెలుస్తోంది. బీజేపీ కార్యకర్తగా ఉంటానని బండి సంజయ్‌ ప్రకటించినట్లు సమాచారం అందుతోంది. కేంద్ర కేబినెట్‌లో చేరేందుకు బండి సంజయ్ విముఖత చూపిస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version