Telangana: ఉపాధ్యాయ, ఉద్యోగులకు గుడ్ న్యూస్… ఆగస్టు 15 తర్వాత డీఏ !

-

తెలంగాణ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఉద్యోగులకు చెల్లించే డి ఏ పై కీలక ప్రకటన చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆగస్టు 15వ తేదీ తర్వాత ఉద్యోగులకు డిఏ ప్రకటిస్తామని… తెలంగాణ ప్రభుత్వం తరఫున.. రేవంత్ రెడ్డి సలహాదారులు వేం నరేంద్ర రెడ్డి ప్రకటన చేశారు.

Good news for teachers and employees

గత కొన్ని రోజులుగా ఉద్యోగులకు డిఏ పెంచాలని డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలోనే ఉపాధ్యాయ అలాగే ఉద్యోగులతో… తాజాగా ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి చర్చలు నిర్వహించారు.

రేవంత్ రెడ్డి సలహాదారులు వేం నరేంద్ర రెడ్డి సమావేశానికి దాదాపు 40 మంది ఉపాధ్యాయ అలాగే ఉద్యోగ సంఘాల నాయకులు వచ్చారు. ఈ సందర్భంగా చర్చలు సఫలమయ్యాయి. ఆగస్టు 15వ తేదీ తర్వాత ఉపాధ్యాయ అలాగే ఉద్యోగులకు బకాయిలో ఉన్న డీఎన్ ప్రకటిస్తామని వేము నరేందర్ రెడ్డి ప్రకటన చేయడం జరిగింది. దీంతో ఉద్యోగులు అలాగే ఉపాధ్యాయ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version