హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వారికి శుభవార్త.. కాచిగూడ నుంచి ప్రత్యేక రైళ్లు

-

తిరుమలకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లే వారి కోసం.. కాచిగూడ నుంచి ప్రత్యేకంగా రైళ్లను ఏర్పాటు చేసింది. మే 11న ప్రత్యేక రైలు ను కాచిగూడ- తిరుపతి మధ్య నడపనున్నారు. ఈ రైలు రాత్రి 10.20 గంటలకు కాచిగూడ నుంచి బయలు దేరి.. మరుసటి రోజు 11 గంటలకు తిరుపతికి చేరుతుంది.

ఇక, మే 12న ప్రత్యేక రైలు తిరుపతి నుంచి కాచిగూడకు నడపనున్నారు. ఈ రైలు మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి నుంచి బయలు దేరి.. మరుసటి రోజు ఉదయం 4 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.

ఈ రెండు రైళ్లు ఉమ్దానగర్‌, షాద్‌ నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌ నగర్‌, వనపర్తి రోడ్, కర్నూల్‌ సిటీ, డోన్‌, గుత్తి, తాడి పత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రత్యేక సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని.. వేసవి సెలవులను చాలా ఆనందంగా నడపాలని దక్షిణ మధ్య రైల్వే శాఖ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version