తెలంగాణ రాష్ట్రంలోని మిర్చి రైతులకు కేసీఆర్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. మిర్చి రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేరుగా కంపెనీలతో రైతుల నుంచి మిర్చి కొనుగోలు చేయించేందుకు ప్రయత్నిస్తోంది.
ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, జనగామ, వరంగల్, సూర్యపేట జిల్లాల్లో తేజ రకం మిర్చిని ప్లాంట్ లిపిడ్స్ సంస్థ కొననుంది. ఈ జిల్లాల్లో 20వేల టన్నుల మిర్చి సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, రైతులకు రవాణా భారం, దళారుల బెడద, తరుగు, కమిషన్ వంటివి తప్పనున్నాయి.