పటాన్ చెరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరో వివాదంలో ఇరుకున్నారు.కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్ధిగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అనుచరుడు యాదగిరి నామినేషన్ దాఖలు చేశారు. అయితే, నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదిలాఉండగా, కాంగ్రెస్ అధిష్ఠానం అల్ఫోర్స్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డిని అదే ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించింది. పార్టీ అధికారికంగా అభ్యర్థిని ప్రకటించాక గూడెం మహిపాల్ రెడ్డి వర్గం ఇలా చేయటం ఏంటని ఒరిజినల్ కాంగ్రెస్ వర్గం మండిపడుతోంది.దీంతో మరోసారి మహిపాల్ రెడ్డిపై ఫిర్యాదుకు కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం సిద్ధమైనట్లు తెలుస్తోంది.