BRS కార్యకర్తల కోసం అదిరిపోయే శుభవార్త

-

BRS కార్యకర్తల కోసం అదిరిపోయే శుభవార్త. రాబోయే రోజుల్లో కార్యకర్తల సంక్షేమం మీద దృష్టి పెడతామని హరీష్‌ రావు ప్రకటించారు. ఈ కష్టమైన సమయంలో పార్టీకి అండగా నిలబడ్డ కార్యకర్తలని తప్పకుండా మిమల్ని కాపాడుకుంటాం.. రేపు ఏ అవకాశం వచ్చిన మీకే అందిస్తామని ప్రకటన చేశారు హరీష్ రావు.

గూడెం మహిపాల్ రెడ్డి పోయినంత మాత్రాన మీరు గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటదని వెల్లడించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేదాకా వాళ్లని వదిలిపెట్టేదే లేదని పటాన్‌చెరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు పేర్కొన్నారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేవరకు మేం నిద్రపోము…సుప్రీంకోర్టు లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పోరాడుతామని ప్రకటించారు. పార్టీ మారిన ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉప ఎన్నిక వస్తుంది… 2001లో తెలంగాణ ఉద్యమం పిడికెడు మందితో ప్రారంభం అయ్యిందన్నారు. కేసీఆర్ ఒక్కడే 14 ఏళ్ళు పోరాడి రాదని అనుకున్న తెలంగాణని తెచ్చి చూపించారని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version