గ్రూపు -2ను వాయిదా వేస్తే నష్టమేమీ లేదు: ప్రొ.కోదండరామ్‌

-

గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులంతా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళన తాజాగా తీవ్ర రూపం దాల్చుతోంది. వీరికి పలు పార్టీల నేతలు.. విద్యార్థి సంఘాలు మద్దతు పలకడంతో ఉద్రిక్తంగా మారుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ నెలాఖరున జరగాల్సిన గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ నేడు గన్‌ పార్క్ వద్ద మౌనదీక్షకు అఖిలపక్షం పిలుపునిచ్చింది.

ఈ క్రమంలో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాంను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. కోదండరామ్‌ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పలువురు ఓయూ విద్యార్థులను సైతం పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. గ్రూప్-2 పరీక్షను వెంటనే వాయిదా వేయాలని కోదండరాం డిమాండ్‌ చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ తప్పిదాలను నిరుద్యోగుల మీద నెట్టడం సరైంది కాదన్నారు.ఒకేసారి 3 రకాల పోటీ పరీక్షలు ఉండటం వల్ల అభ్యర్థులు మనోవేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజుల పాటు గ్రూపు -2 పరీక్షను వాయిదా వేస్తే నష్టమేమీ లేదు. సమస్యను పరిష్కరించాల్సింది పోయి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version