ఏపీ ప్రభుత్వం కుట్ర చేసింది : గుత్తా సుఖేందర్

-

ఏపీ ప్రభుత్వంపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. సాగర్ ప్రాజెక్టు 13 గేట్లను ఆధీనంలోకి తీసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దురాలోచనతోనే ఏపీ ప్రభుత్వం ఈ దుశ్చర్యకు పాల్పడిందని విమర్శించారు.

ఇష్టానుసారంగా వ్యవహరిస్తే రాష్ట్రాల సంబంధాలు దెబ్బతింటాయన్నారు. రాష్ట్రాల పరిధిలో ఉండే హక్కుల్ని కేంద్రం చేతుల్లోకి వెళ్లేలా ఏపీ కుట్ర చేసిందని ఆరోపించారు. మరోవైపు ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాద పరిష్కారానికి చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఇవాళ దిల్లీలో జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో అత్యవసర సమావేశం జరిగింది. తెలంగాణ, ఏపీ సీఎస్‌లు, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్‌ డీజీలు, ఆన్‌లైన్‌ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు ఈ సమావేశానికి కేంద్ర జల సంఘం అధికారు లు, కేఆర్ఎంబీ అధికారులు నేరుగా హాజరయ్యారు. సాగర్ వద్ద పరిస్థితి కొలిక్కి తేవడంపై అధికారులు చర్చిస్తు న్నారు. సాగర్, శ్రీశైలం, అనుబంధ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై చర్చ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version