ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి… అన్ని ఇచ్చేదాక నీపేరు ఇలాగే పిలుస్తాని రేవంత్ రెడ్డిపై సెటైర్లు పేల్చారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఇక నిన్ను రేవంత్ రెడ్డి అని పిలవబోం.. కొత్త పేరుతోనే పిలుస్తానన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇవాళ సిద్దిపేటలో మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు.
రుణమాఫీ అయిపోయిందని సీఎం రేవంత్ హైదరాబాద్ లో మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. ప్రజాపాలనలో రుణమాఫీ కాలేదని దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు. సీఎం రేవంత్ సిద్దిపేటకి వస్తారా…లేకపోతే ఆయన గ్రామం కొండారెడ్డిపల్లికి పోదామా చెప్పాలని సవాల్ చేశారు. రుణమాఫీ అయ్యిందో లేదో చూద్దామన్నారు హరీష్ రావు. పూర్తి రుణమాఫీ చేస్తానని పాక్షిక రుణమాఫీ చేస్తున్నారని…సీఎం రేవంత్ మాటలు నమ్మి రైతులు ఆగం అయ్యారని ఆగ్రహించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉందో ఈ ఘటనలు చిన్న ఉదాహరణ అని తెలిపారు.
ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి
అన్ని ఇచ్చేదాక నీపేరు ఇలాగే పిలుస్తాం..
-మాజీ మంత్రి హరీశ్ రావు#HarishRao #FormerministerHarishRao #Protocol #Congress #GramaSabhalu #CMRevanthreddy pic.twitter.com/8uYSuSWCTQ
— Pulse News (@PulseNewsTelugu) January 22, 2025