రూ.4 వేల పింఛన్‌ నాలుక మీదనే ఉంది: హరీశ్‌రావు

-

బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పాలన బాగాలేదని ఆధారాలు చూపించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తమ ప్రభుత్వ పాలనలో రూ.200పింఛన్‌ను రూ.2వేలకు పెంచామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన రూ.4 వేల పింఛన్‌ హామీ ఇంకా నాలుక మీదనే ఉందని పేర్కొన్నారు. పల్లెల్లో టాప్‌ 20లో 14 తెలంగాణకు వచ్చాయని.. పదేళ్ల పాలనలో ఉన్న సమాచారాన్ని తొలగించారని మండిపడ్డారు.

రాష్ట్ర బడ్జెట్‌ అవాస్తవాలతో కూడిన బడ్జెట్‌ అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ట్యాక్స్‌ రెవెన్యూ ఎక్కువ వస్తుందని బడ్జెట్‌లో పెట్టారని.. విధానాల రూపకల్పన కంటే తమను తిట్టడంపైనే ఎక్కువ దృష్టిపెట్టారని పేర్కొన్నారు. పదేళ్ల తమ శ్రమనా… ఎనిమిది నెలల కాంగ్రెస్ డ్రామానా? అని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ పాలనలో కరెంట్ పరిస్థితి గురించి రేవంత్‌రెడ్డి మాట్లాడారని.. కేశవరావు ఇంటికి సీఎం పోతే కరెంట్ పోయిందని.. బడ్జెట్‌లో వాస్తవాల విస్మరణ… అవాస్తవాల ప్రస్తావన ఎక్కువగా ఉందని మండిపడ్డారు. తమ పనితీరు తెలియకూడదని పదేళ్ల ప్రభుత్వం సమాచారాన్ని తొలగించారని ఆరోపించారు. కంప్యూటర్ నుంచి తొలగిస్తారేమో కానీ, ప్రజల మెదడు నుంచి తొలగించలేరని పేర్కొన్నారు. అక్షరాలను తొలగిస్తారేమో కానీ… అనుభవాల్ని తొలగించలేరని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version