తెచ్చిన ప్రతి పైసా భవిష్యత్‌ అవసరాల కోసం ఖర్చు పెట్టాం: హరీశ్‌రావు

-

మంచినీళ్ల కోసం ప్రజల నుంచి ఎక్కడా ఒక్క రూపాయి వసూలు చేయలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. తెచ్చిన అప్పులు ఎలా వినియోగించాం అనేది ముఖ్యమని తెలిపారు. అప్పులు తెచ్చి… రాష్ట్రంలో ఆస్తులు సృష్టించామని వెల్లడించారు. ఎక్కువ మూలధన వ్యయం చేసిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు.తెచ్చిన ప్రతి పైసా భవిష్యత్‌ అవసరాల కోసం ఖర్చు పెట్టినట్లు వివరించారు. ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం రుణాలు తెచ్చామని హరీశ్ రావు శాసనసభా వేదికగా స్పష్టం చేశారు.

“483 శాతం ధాన్యం కోనుగోళ్లలో వృద్ధి సాధించాం. 2014లో కోటి మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి ఉండేది. ప్రస్తుతం 4 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి ఉంది.  రూ.1, 649 కోట్లతో 25 జిల్లాల్లో కలెక్టరేట్లు పూర్తి చేశాం. రూ. 72 వేల కోట్లు రైతుబంధు కింద పెట్టుబడి సాయంగా అందించాం. తెలంగాణ రాష్ట్ర కీర్తి, పరపతి పెంచాం. రాజకీయం కోసం అప్పుల రాష్ట్రంగా ప్రచారం చేయవద్దు. తెలంగాణకు ఉన్న రుణాలు దీర్ఘకాలిక రుణాలు. ఈ రుణాలు అన్నీ పదేళ్ల తర్వాత చెల్లించాల్సినవే. 15.6 శాతం వృద్ధిరేటుతో తెలంగాణను దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిపాం. ఆరోగ్య రంగంలో వ్యయాన్ని ఆరు రెట్లు పెంచాం. కేంద్రం నుంచి రావాల్సిన డబ్బు రూ.లక్ష కోట్ల వరకూ ఆగిపోయింది.” అని హరీశ్ రావు వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version