తెలంగాణలో జులై నుంచి హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డులు

-

తెలంగాణలో వచ్చే జులై నుంచి హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డులను అందజేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ఎలాంటి భేషజాలకు పోకుండా ప్రజలు గర్వించేలా పనిచేస్తామని వెల్లడించారు. ఆధార్‌ కార్డు సంఖ్య తరహాలో ఒక్కో పౌరుడికీ స్మార్ట్‌ కార్డు వంటి హెల్త్‌ ప్రొఫైల్‌ సంఖ్యతో గుర్తింపు కల్పిస్తామని పేర్కొన్నారు. పేరు టైప్‌ చేస్తే సమగ్ర వైద్య సేవల వివరాలు తెలుసుకునేలా చర్యలు చేపట్టామని చెప్పారు. ఏ వైద్యుడిని సంప్రదించినా వారి ఆరోగ్య స్థితిగతులను వెంటనే తెలుసుకుని మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఇది దోహదపడుతుందని వివరించారు.

హైదరాబాద్‌ ఆర్టీసీ కళాభవన్‌లో మంథని వైదిక సంస్థ ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్‌బాబుకు ఆదివారం సత్కార సభ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  మాజీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేల క్వార్టర్లలోని డిస్పెన్సరీలతోపాటు అన్ని ఆసుపత్రుల్లో చికిత్సకు అనుగుణంగా ఔషధాలను సరఫరా చేయాలని అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version