తెలంగాణ భవన్‌ కు భారీగా పోలీసులు..ఏ క్షణమైనా కేటీఆర్‌ అరెస్ట్‌ !

-

తెలంగాణ భవన్‌ కు భారీగా పోలీసులు వస్తున్నారు. దీంతో ఏ క్షణమైనా కేటీఆర్‌ అరెస్ట్‌ అయ్యే ఛాన్స్‌ ఉందని అంటున్నారు. ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్ అరెస్ట్‌కు రంగం సిద్ధం అవుతున్నట్లు సమాచారం అందుతోంది. ఇవాళ ఏ క్షణమైనా కేటీఆర్‌ను అరెస్టు చేసే ఛాన్స్‌ ఉందన్న ప్రచారం జరుగుతోంది. దీంత పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా జరుగుతోంది.

Heavy police presence at Telangana Bhavan

తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరిస్తుండడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ  నేతలు సైతం భారీగా తెలంగాణ భవన్ కు తరలి రావడం జరుగుతోంది. బీఆర్ఎస్ శ్రేణులు సైతం భారీగా తెలంగాణ భవన్ కు తరలివస్తున్న వస్తున్న నేపథ్యంలోనే…పోలీసులకు కూడా చేరుకుంటున్నారు.  అటు ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారట. హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేసే యోచనలో కేటీఆర్ ఉన్నట్లు సమాచారం. FIR నమోదు కావడంతో క్వాష్ పిటిషన్‌ వేసేందుకు అవకాశం ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news