హైదరాబాద్ నగరమంతా ఒక్కసారిగా అతలకుతలమైంది. ఓ వైపు భారీ వర్షం.. మరో వైపు జనాల ఇబ్బందులు పడుతున్నారు. సొంతూర్లకు రాఖీ కట్టేందుకు మహిళలు బారులు తీరారు. దాదాపు గంటన్నర కి పైగా ఏకధాటిగా కురిసిన వర్షానికి హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్ల పై ఎక్కడికక్కడ నిలిచిపోయాయి వాహనాలు. కేవలం కిలోమీటర్ దూరం ప్రయాణించడానికి దాదాపు అర గంటకు పైగా సమయం పడుతుండటం విశేషం. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై నిలిచింది వర్షపు నీరు. రోడ్లన్నీ జలమయంగా కనిపిస్తున్నాయి. ఇక కాలేజీలు, స్కూళ్లు వదిలే టైమ్ కావడంతో ట్రాఫిక్ క్లియర్ కావడానికి మరి కొన్ని గంటలు పట్టే ఛాన్స్ ఉంది. షేక్‌పేట, ఫిలింనగర్, గోల్కొండ నానక్‌రామ్‌గూడ ప్రాంతాల్లో వాహనదారులకు ఇక్కట్లు పడుతున్నారు. ఇక గచ్చిబౌలిలోనూ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈస్ట్ జోన్ పరిధిలోని విజయవాడ జాతీయ రహదారి, నాగార్జున సాగర్ హైవే పై కూడా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో బస్సులు రాక అవస్థలు పడుతున్నారు.