దుబ్బాక నియోజకవర్గంలో పెరిగిన ఓటింగ్ శాతం ఇప్పుడు టెన్షన్ రేపుతోంది. మూడు ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అనేక ఎత్తులు, జిత్తులతో ఈ ఎన్నికలలో గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక ఏకపక్షం అనుకున్న సమయంలో బీజేపీ, కాంగ్రెస్ లు కూడా దూకుడుగా వ్యవహరించడం అధికార టీఆర్ఎస్కు వణుకు పుట్టిస్తోంది.
5 గంటల వరకు దుబ్బాక లో 81.44 శాతం పోలింగ్ నమోదయింది. అంటే ఇంకా గంట పోలింగ్ ఉంది. ఈ గంట కాక ఆరింటిదాకా లైన్ లో ఉన్నవారికి అవకాసం ఇస్తారు. మరి ఈసారి ఈ లెక్కన భారీగానే వోటింగ్ నమోదు కానుంది. అదీ కాక కరోనాను కూడా లెక్క చేయకుండా గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువగా …శాతం పోలింగ్ నమోదు కావడంతో ప్రధాన పార్టీల మధ్య కొత్త టెన్షన్ తెచ్చి పెట్టింది. అయితే గతంలో ఎన్నికల శాతం పెరిగిన ప్రతి సారి అధికార పార్టీలకి దెబ్బ పడేది దీంతో ఇప్పుడు టీఆర్ఎస్ లో కూడా టెన్షన్ వాతారవరణం నెలకొంది. చూడాలి మరి ఏమవుతుందో ?