రేవంత్ రెడ్డికి HMDA లీగల్ నోటీసులు

-

టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి హెచ్ఎండిఏ కమిషనర్ లీగల్ నోటీసులు జారీ చేశారు. ఓఆర్ఆర్ టెండర్లపై రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు హెచ్ఎండిఏ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని నోటీసులలో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను 48 గంటలలోపు ఉపసంహరించుకోవాలని.. హెచ్ఎండిఏ కమిషనర్ కు క్షమాపణలు చెప్పాలని నోటీసులలో డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇలాంటి నిరాధారమైన, కించపరిచే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని నోటీసులలో హెచ్చరించారు. అయితే ఈ నోటీసులపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఓఆర్ఆర్ టెండర్లపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని.. లీగల్ నోటీసులపై న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version