జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు.. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

-

జర్నలిస్టులకు సంబంధించిన ఇండ్ల పట్టాలను ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. జవహర్ లాల్  నెహ్రూ సొసైటీకి సంబంధించిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..  జిల్లాలు, మండలాల్లో జర్నలిస్టుల ఇండ్ల స్థలాలకు ఎలాంటి ఇబ్బందులు లేవని..  కేవలం హైదరాబాద్ లోనే చాలా ప్రాబ్లమ్ ఉందని తెలిపారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా  24 వేల అక్రిడేషన్లు ఉన్నాయని తెలిపారు. అర్హులైన వారందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనన్నారు. 2016 అక్రిడేషన్ రూల్స్ లో చాలా పొరపాట్లు ఉన్నాయన్నారు. ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా చేశారని పేర్కొన్నారు. ఆ రూల్స్ ని కోర్టు కూడా కొట్టేసిందని గుర్తు చేశారు. భాషా ప్రాతిపదికన అక్రిడిటేషన్ కార్డులు విభజన జరగకూడదన్నారు. అక్రిడిటేషన్ జారీకి భాషా, కులం, మతంతో సంబంధం ఉండకూడదని తెలిపారు. సర్క్యులేషన్ ప్రాతిపదికన పత్రికలను చూడాలన్నారు. 25 వేలలోపు సర్క్యులేషన్ ఉన్న పత్రికలను స్మాల్ న్యూస్ పేపర్ కింద పరిగణిస్తారని తెలిపారు. 25వేల నుంచి 50వేల వరకు సర్క్యూలేషన్ ఉన్న పత్రికలను మధ్య తరహా పత్రికలుగా, 50 వేల నుంచి 75 వేల వరకు సర్క్యూలేషన్ కలిగిన వాటిని పెద్ద పత్రికలుగా పరిగణిస్తారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version