వాస్తు ప్రకారం ఫాలో అయితే చక్కటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. పూర్వకాలం నుంచి మన పెద్దలు వాస్తు శాస్త్రాన్ని నమ్ముతున్నారు. వాస్తు ప్రకారం మనం ఎప్పటి నుంచో ఇళ్లను కట్టుకుంటున్నాం. అయితే వాస్తు ప్రకారం పాటించడం వలన ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి. వాస్తు ప్రకారం డైనింగ్ టేబుల్ విషయంలో మనం వాస్తు నియమాలని పాటించాలి. ఆ నియమాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు ప్రకారం తెలిసే తెలియక తప్పులు చేయకూడదు. కొందరు పెట్టకూడని వస్తువుల్ని డైనింగ్ టేబుల్ పై పెడుతూ ఉంటారు. దీని కారణంగా నెగిటివ్ ఎనర్జీ కలుగుతుంది ఫలితంగా ఇల్లంతా వ్యాపించి దోషాలని కలిగిస్తుంది. వాస్తు ప్రకారం కొన్ని రకాల వస్తువులని డైనింగ్ టేబుల్ పై పెట్టకూడదు. తాళం చెవులను డైనింగ్ టేబుల్ పై ఉంచడం వలన నెగిటివ్ ఎనర్జీ కలుగుతుంది. కొందరు మందుల్ని కూడా డైనింగ్ టేబుల్ పై పెడుతుంటారు ఇది కూడా తప్పే.
వాస్తు ప్రకారం డైనింగ్ టేబుల్ పై మందులు పెట్టడం వలన నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది భోజనం చేసిన వెంటనే టాబ్లెట్లను వేసుకోవచ్చని ఇలా పెడుతూ ఉంటారు. కానీ ఈ తప్పు చేయకూడదు. పుస్తకాలని కూడా డైనింగ్ టేబుల్ పై పెట్టకూడదు. ఇది కూడా నెగటివ్ ఎనర్జీని కలిగిస్తుంది. కత్తులు, పదునైన వస్తువులు కూడా డైనింగ్ టేబుల్ పై ఉంచకూడదు ఇలా కొన్ని రకాల వస్తువుల్ని డైనింగ్ టేబుల్ పై పెట్టడం మానుకోవాలి దీని వలన వాస్తు సమస్యలు కలుగుతాయి. లేనిపోని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. నెగటివ్ ఎనర్జీ కలిగి ఇబ్బందుల్ని తీసుకువస్తుంది.