తెలంగాణలో ఉద్యోగ ఖాళీలెన్నో తెలుసా..?

-

రాష్ట్ర వేతన సవరణ సంఘం(పీఆర్సీ) వెల్లడించిన నివేదిక ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో1,91,126 ఉద్యోగాలు ఖాళీ ఉన్నట్లు వెల్లడైంది. రాష్ట్రంలోని మొత్తం 4,91,304 ఉద్యోగాలకూ 3,00178 ఉద్యోగులే విధులు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణలో ప్రతి వెయ్యిమందికి 8.5 మందే ప్రభుత్వ ఉద్యోగులు సేవలందిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 3.52 కోట్లు ఉండగా మంజూరైన ఉద్యోగాలను లెక్కలోకి తీసుకుంటే ప్రతి వెయ్యిమంది జనాభాకు దాదాపుగా 14 మంది ఉద్యోగులు ఉండాలి. కానీ.. ఖాళీల నేపథ్యంలో 8.5 మందితో సర్దుకుపోతున్నారు.

ఐదింటిలోనే..

రాష్ట్రం మొత్తంలో 32 శాఖలు ఉండగా కేవలం ఐదు శాఖల్లోనే అధిక సంఖ్యలో ఉద్యోగార్ధులు ఉన్నారు. అ«ధికంగా విద్యాశాఖలో 1,37,851 మంజూరైన ఉద్యోగాలకు 1,13, 853 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఆరోగ్యశాఖలో 52,906 ఉద్యోగాలకు 22,336, రెవెన్యూలో 27,786 కు 19,825 హోంశాఖలో 98,394 కు 61,212 పంచాయితీరాజ్‌ శాఖలో26,201 ఉద్యోగాలకు 13, 573 మంది తమ తమ విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రంలో ఈ ఐదు శాఖల్లోనే అధికంగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఉన్న ఖాళీలు భర్తీ కాకపోవడంతో 50,400 కాంట్రాక్ట్, 58128 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పని చేస్తున్నారు.

తలెత్తుతున్న సమ్యలివే..

రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలతో తమపై అ«ధిక భారం పడుతుందని ఆయా శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు వాపోతున్నారు. వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు సరైన సేవలు అందించలేకపోతున్నామని.. దీంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. రవాణా ఖర్చులు, వసతి ఎక్కువవుతున్నాయంటున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు, పలు పరిపాలన విభాగాలను ఏర్పాటు చేసిన కూడా వాటిల్లో ఉండే ఖాళీల మూలంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version