హైదరాబాద్ లో దారుణం.. వైద్యుడి ఇంట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత

-

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ వైద్యుడి ఇంట్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. దీపావళి పండుగనాడు పార్టీ కోసం డ్రగ్స్ తీసుకొచ్చాడు డాక్టర్.   హైదరాబాద్ లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్మోహర్ పార్క్ లోని ఓ వైద్యుడి ఇంట్లో డ్రగ్స్ పార్టీకి ప్లాన్ చేశారు నిందితులు. అయితే….. పక్క సమాచారంతో ఆ ఇంటి పై చందానగర్ పోలీసులు…దాడులు జరపడం జరిగింది.

Huge amount of drugs seized from doctor’s house

ఈ తరుణంలోనే… రాజస్థాన్ నుండి డ్రగ్స్ తెచ్చి నగరంలో విక్రయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు… నిందితులను గుర్తించారు. అనంతరం ఘటన స్థలంలో 18 లక్షల విలువ చేసే 150 గ్రాముల MDMA డ్రగ్స్ ను సీజ్ చేశారు పోలీసులు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకోగా మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు చందానగర్ పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version