SLBC టన్నెల్ లో చిక్కుకున్న కుటుంబాలకు భారీ పరిహారం ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే…. SLBC టన్నెల్ దగ్గరకు చేరుకున్నారు జేపీ కంపెనీ చైర్మన్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యులు. మరి కాసేపట్లో మృతుల కుటుంబాలకు పరిహారం, ఇన్స్యూరెన్స్ విషయములో స్పష్టత రానుంది.
మృత దేహాలను వారి స్వస్థలాలకు పంపేందుకు అంబులెన్స్ లను సిద్దం చేశారు అధికారులు. మరికొద్ది సేపట్లోనే టన్నెల్ దగ్గరికి చేరుకోనున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ సాయంత్రం లోగా రెస్క్యూ పూర్తయ్యే అవకాశం ఉంది అంటున్నారు. మరి దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా… SLBC టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది మరణించారట.