కన్నెపల్లి పంపుహౌస్ లో భారీ కొండచిలువ కలకలం !

-

Huge python in Kannepally pump house: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ కొండ చిలువ కలకలం రేపింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్(మం) కన్నెపల్లి జెన్ కో పంపుహౌస్ లో భారీ కొండ చిలువ కలకలం రేపింది. గత రాత్రి కన్నెపల్లి జెన్ కో పంపుహౌస్ ఆవరణంలోకి ప్రవేశించింది కొండచిలువ. దీంతో భయాందోళనకు గురయ్యారు జెన్ కో ఉద్యోగులు.

Huge python in Kannepally pump house

అనంతరం కొండచిలువను తాడుతో కట్టేసి ఫారేస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చింది జెన్ కో సిబ్బంది. అనంతరం భారీ ఆనకొండను పట్టుకొని గ్రావీటి కెనాల్ అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలేశారు ఫారెస్ట్ అధికారులు. దీంతో కన్నెపల్లి జెన్ కో పంపుహౌస్ లో పనిచేసే జెన్ కో సిబ్బంది ఊపిరి పీల్చుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version