తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఇవాళ్టి నుంచి 3 రోజులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించారు. తెలంగాణలో చలి బీభత్సం కొనసాగిస్తోంది. రాబోయే మరో మూడు రోజుల పాటు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని రాబోయే మరో మూడు రోజుల పాటు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ముఖ్యంగా ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలో 9.5 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో 10-14 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. నిన్న అత్యల్పంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (U) లో 9.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డు అయింది. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల రాత్రి పూట ప్రయాణాలు చేసేవారు మానుకోవాలని వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.