గుండెపోటుతో జిమ్‌లో ఒక్కసారిగా కుప్పకూలిన కానిస్టేబుల్‌

-

constable dieహైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. జిమ్‌లో కసరత్తు చేస్తున్న కానిస్టేబుల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుండెపోటు రావడంతో క్షణాల్లోనే చనిపోయాడు. గమనించిన సిబ్బంది ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు.

హైదరాబాద్​లోని ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నర్వహిస్తున్న విశాల్‌.. ఇవాళ ఉదయం బోయిన్‌పల్లిలోని ఓ జిమ్‌కు వెళ్లాడు. వ్యాయామం చేస్తూ ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందోనని సహచరులు వచ్చి చూసేలోపే మరణించాడు. అయితే ఆయనను ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మరణించాడని వైద్యులు నిర్ధారించినట్లు సహచరులు తెలిపారు. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని.. యువకులు తమ డైట్​ను సక్రమంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version