డ్రగ్స్ కేసులో సైబర్‌క్రైమ్ SI రాజేంద్ర అరెస్టు

-

డ్రగ్స్ విక్రయిస్తూ సబ్ ఇన్​స్పెక్టర్ పోలీసులకు పట్టుబడిన ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది. ఓసారి డ్రగ్స్‌ విక్రయిస్తూ ఏసీబీ కేసులో.. సస్పెండ్ అవడంతో హైకోర్టులో నుంచి స్టే తెచ్చుకొని సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు రాజేంద్ర. పద్ధతి మార్చుకోకుండా మరోసారి అక్రమాలకు పాల్పడి జైలు పాలయ్యాడు.

సైబర్‌ క్రైమ్‌ ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన రాజేంద్ర… ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక కేసు దర్యాప్తులో మహారాష్ట్రకు వెళ్లి.. అక్కడ నైజీరియాలో తనిఖీ చేస్తుండగా.. డ్రగ్స్​ సంచిని గుర్తించారు. నిందితుడిని హైదరాబాద్‌ తీసుకొచ్చి అరెస్ట్‌ చూసి రిమాండ్‌కు తరలించారు. స్వాధీనం చేసుకున్న మెథకొలిన్‌ డ్రగ్స్ ను రాజేంద్ర మణికొండలోని తన ఇంట్లో ఉంచి.. దాన్ని విక్రయించాలని నిర్ణయించుకున్నాడు.

మణికొండలోని ఒక వ్యక్తి వద్ద ఖరీదైన డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయని తెలుసుకున్న తెలంగాణ స్టేట్‌ యాంటీ నార్కొటిక్‌ బ్యూరో పోలీసులు డెకాయ్‌ ఆపరేషన్‌తో తామే కొనుగోలుదారులుగా నమ్మించి.. ఎస్సై రాజేంద్ర బయటకు వచ్చేలా చేశారు. శనివారం మధ్యాహ్నం డ్రగ్స్‌ పొట్లాలు తీసుకొని బయల్దేరిన రాజేంద్రను. అప్పటికే కాపుగాసిన పోలీసులు నిందితుడి అదుపులోకి తీసుకున్నపుడు.. డ్రగ్‌ విక్రయాలు జరుపుతున్న ఎస్సై రాజేంద్రగా గుర్తించారు. శనివారం సాయంత్రం రాజేంద్రని అరెస్ట్‌ చేసి.. రిమాండ్‌కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version