ప్రజలపై ఆర్థికభారం తగ్గించడానికే ఛలానా డిస్కౌంట్లు ప్రకటించామని.. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో సామాన్యులపై ఆర్థిక భారం పడుతున్న కారణంగా పెండింగ్ ఛలానా డిస్కౌంట్ ప్రకటించామని అన్నారు ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 1750 కోట్ల ఛలానాలు పెండింగ్ లో ఉన్నాయని ఆయన అన్నరు. డిస్కౌంట్ ప్రకటించడం ద్వారా కేవలం రూ. 300 కోట్లు మాత్రమే ఆదాయం రానుందని అన్నారు. ట్రాఫిక్ ఛలాన్ల వల్ల ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుందనే అపోహ ఉండకూడదని అన్నారు. రెవెన్యూ నింపడానికి అయితే డిస్కౌంట్ ప్రకటించే వాళ్లం కాదని అన్నారు.
మార్చి 31 తరువాత ఛలాన్లపై రాయితీ ఉండదు… ఆ తరువాత చర్యలే : ఏవీ రంగనాథ్, జాయింట్ సిపి, ట్రాఫిక్, హైదరాబాద్
-