నేడు బెంగళూరుకు హైడ్రా బృందం..రెండు రోజుల పాటు టూర్ !

-

హైడ్రా బృందం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు బెంగళూరుకు హైడ్రా బృందం వెళ్లనుంది.. రెండు రోజుల పాటు బెంగళూరులో పర్యటించనుంది హైడ్రా. బెంగళూరులో చెరువుల పరిరక్షణ ఎలా ఉంది.. అక్కడి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.. అనే దానిపై అన్వేషణ చేయనుంది హైడ్రా. ఈ నేపథ్యంలోనే.. నేడు బెంగళూరుకు హైడ్రా బృందం వెళ్లనుంది.. రెండు రోజుల పాటు బెంగళూరులో పర్యటించనుంది హైడ్రా.

చెరువుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది హైడ్రా బృందం. ఈ మేరకు బెంగళూరుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు..బయల్దేరనున్నారు. ఇక అటు ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి నిర్మాణాలు చేసిన వారికి నోటీసులు జారీ చేస్తున్న హైడ్రా … కబ్జాను బట్టి వారం నుంచి 15 రోజుల టైం ఇస్తామంటున్నది. ఇప్పటికే సుమారు 60 నోటీసులు జారీచేసింది హైడ్రా. ఈ నెలాఖరికి కొన్ని అక్రమ నిర్మాణాలను డిమాలిష్ చేయనుంది హైడ్రా.

Read more RELATED
Recommended to you

Exit mobile version