హనుమకొండలోని మహాదేశ్వర స్వామి ఆలయంలో విగ్రహాలు ధ్వంసం !

-

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి విగ్రహాల ధ్వంసం ఇష్యూ తెరపైకి వచ్చింది. హనుమకొండలోని మహాదేశ్వర స్వామి ఆలయంలో విగ్రహాలు ధ్వంసం చేశారు. హనుమకొండలో మహాదేశ్వర స్వామి ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేశారు దుండగులు. ఈ సంఘటన ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారింది.

Idols were vandalized in Mahadeshwara Swamy Temple in Hanumakonda

కమలాపూర్ మండలం శనిగరంలో మహాదేశ్వర స్వామి దేవాలయంలో విగ్రహాలను ధ్వంసం చేశారు దుండగులు. నెల రోజుల క్రితం ఇదే గ్రామ రామాలయంలో పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లారు దుండగులు. అయితే.. ఈ సంఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కమలాపూర్ పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version