ఇందిరమ్మ రాజ్యంలో వ్యవసాయం దండుగ కాదు.. పండుగ : సీఎం రేవంత్ రెడ్డి

-

ఇందిరమ్మ రాజ్యంలో వ్యవసాయం దండుగ కాదు.. పండుగ అపి నిరూపించామని తెలంగాణ  సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గాంధీభవన్ లో నూతన పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు రుణమాఫీకి ఆనాడు హామీ ఇచ్చాం.. నిరూపించాం. రాజీనామా అంటూ సవాల్ చేసిన వాళ్లు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు.

రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తే.. రాజీనామా చేస్తామన్నారు హరీశ్ రావు. రాజీనామా చేయకుండా ఎక్కడ దాక్కున్నారు. మార్పు రావాలంటే.. కాంగ్రెస్ రావాలని ఎన్నికల్లో కోరాం. రాజీవ్ ఆరోగ్య శ్రీ ని బీఆర్ఎస్ నీరు గార్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితో పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నామని తెలిపారు. చెప్పిన మాట ప్రకారం.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నామని తెలిపారు. యువత కోసం స్కిల్ యూనివర్సిటీ తీసుకొస్తున్నాం. ఎన్నో పోరాటాల తరువాత స్వరాష్ట్రం వచ్చింది. వరంగల్ సభ వేదికగా రుణమాఫీ పై ప్రజలు హామీ ఇచ్చామని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version