తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఈనెల 25న విడుదల కానున్నాయి. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయినవారు ఫస్ట్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ కోసం రాసిన వారు దాదాపు 4.5 లక్షల మంది ఉన్నారు. గత పరీక్షల మూల్యాంకనంలో తప్పులు జరిగిన నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
డీకోడింగ్, ఆన్లైన్ లో మార్కుల ఎంట్రీ పూర్తయింది. ఏవైనా అనివార్య పరిస్థితులు ఏర్పడితే ఈనెల 26 లేదా 27న విడుదల చేస్తారు. కాగా, దోస్త్ సెకండ్ ఫేజ్ సీట్లను 41,553 మంది విద్యార్థులకు కేటాయించినట్లు విద్యాశాఖ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. నేటి నుంచి మూడో విడత రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుందని చెప్పారు. జులై రెండు వరకు నమోదు ప్రక్రియ ఉంటుందని, 6న సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. కాగా, తొలి విడతలో 76,290 మందికి సీట్లు దక్కగా 57 వేల మందే ప్రవేశాలు పొందారు.