ప్రగతి భవన్ కేసీఆర్ సొంత జాగీరా ? : ఈటల

-

ప్రగతి భవన్ ఏమైనా  కేసీఆర్ సొంత జాగీరా అని ప్రశ్నించారు  హూజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఇవాళ మీడియాతో ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా  కేసీఆర్ చీటికి మాటికి మహారాష్ట్రకు ఎందుకు వెళ్తున్నారు.. దళితులను సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పలేదా..?  అని ప్రశ్నించారు. 

2018 వరకు కేసీఆర్ అంటకాగలేదా. 2019లో ఎన్నికల్లోకి వస్తే ఓడిపోతామనే భయంతో ముందస్తు ఎన్నికల్లోకి వెళ్లారు.  తెలంగాణలో బీజేపీ ఎక్కడిదన్నారు.  దుబ్బాకలో ఫలితం ఎలా వచ్చింది.  హుజూరాబాద్, దుబ్బాక ఫలితాల మాదిరిగా వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలుంటాయన్నారు. ప్రధానంగా హుజూరాబాద్ లో రూ.400 కోట్లు ఖర్చు చేసి మరీ దళితబంధు ఇప్పించావు. అయినా గెలిచావా..? కరప్షన్ ప్రీ గవర్నమెంట్ అని చెప్పారు కదా..? ఏమైంది అని ప్రశ్నించారు. కరీంనగర్ పార్లమెంట్  ఎన్నికల్లో  ఫలితం ఎందుకు మారింది. నాలుగు నెలల్లోనే బీఆర్ఎస్ పై ప్రజలు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version