తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు ఎండలే !

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ఠ్. తెలంగాణలో వచ్చే నాలుగు రోజుల పాటు సాధారణ వర్షాలే ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు ఎండలు కొడతాయని వార్నింగ్‌ ఇచ్చింది. కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే 2-4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని పేర్కొంది.

తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైన ఉక్కపోత.. వేడిమి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వచ్చే వారం నుంచి తెలంగాణలో భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.

ఆవర్తనం కోస్తా ఆంధ్ర మరియు దానిని ఆనుకొని ఉన్న తెలంగాణ ప్రాంతాలలో సముద్ర మట్టానికి 5.8 కి. మీ ఎత్తులో ఏర్పడింది. రాగాల రెండు రోజులకు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీస్తాయట. జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version