నియంత పాలనకు చరమ గీతం పాడి సరిగ్గా ఏడాది అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. తాజాగా ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రుల సమిష్టి నిర్ణయాలతో కాంగ్రెస్ ఏడాది పాలనలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో వెలిగిపోతున్నదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ ఏడాది కాలంలో దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయలేనంత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి ప్రజల మన్ననలు పొందిందన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాపాలనకు ఏడాది పూర్తి అయిన సందర్భంగా మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సరిగ్గా ఏడాది క్రితం రాష్ట్రంలో నియంత పాలనకు చరమ గీతం పాడి ప్రజా పాలన ఏర్పాటుకు తెలంగాణ ప్రజలు సంపూర్ణంగా సహకరించారు. గడీల పాలన, ఫామ్ హౌస్ పాలనతో విసిగిపోయి, అవినీతి, కుటుంబ పాలనకు స్వస్తి పలికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సంపూర్ణ మెజారిటీ ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.