చాలా మంది ట్రాన్స్ జెండర్ అంటరాని వారిగా చూస్తారు. వారిని చూసిన వారు అసహించుకుంటుంటారు. బస్టాండ్ లలో, రైళ్లలో, బస్సులో చప్పట్లు కొడుతూ డబ్బులు అడుగుతూ వారి జీవనం సాగిస్తుంటారు. వీరిక్కూడా మనసు ఉంటుందని.. కుటుంబాలకు దూరమై బాధతో బతుకుతుంటారని మాత్రం ఎవ్వరూ ఊహించలేరు. వీరంతా ఒక చోట కలిస్తే.. పండగ వాతావరణం అనే చెప్పాలి. వీరు కూడా ఈవెంట్లు చేసుకుంటారనే విషయం చాలా మందికి తెలియదు.
జెండర్స్ గా మారిన వ్యక్తులను ట్రాన్స్ జెండర్స్ ఆధ్వర్యంలో జల్సా ఈవెంట్ చేస్తారు. దీనినే జల్సా అని పిలుస్తారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఈ పండుగ జరుపుకుంటారు. రాష్ట్ర నలుమూలల నుంచి ట్రాన్స్ జెండర్ కమిటీ హాజరై జల్సా వేడుకలు జరుపుకుంటారు. ఈ సందర్భంగా ట్రాన్స్ జెండర్లు మాట్లాడుతూ.. ట్రాన్స్ జెండర్లు సర్జరీ చేయించుకొని 41 రోజులు ఇంట్లో విశ్రాంతి తీసుకున్న తరువాత తమ కులదైవం అయిన అమ్మవారికి పూజ నిర్వహించి ట్రాన్స్ జెండర్ గా మారిన వారికి ఓ ఈవెంట్ నిర్వహిస్తారు అదే జల్సా. ఆడవాళ్లకు సారీ పంక్షన్ ఎలాగో.. జల్సా పేరిట నిర్వహించే ఈవెంట్ కి చాలా ప్రాముఖ్యత ఇస్తారు.