పొంగులేటి మరో ఏక్‌నాథ్ షిండే అవుతాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్. రైతుబంధు డబ్బులు 5 వేల కోట్లు పొంగులేటి తన ఖాతాలో వేసుకున్నాడని ఆగ్రహించారు కేఏ పాల్.అలాగే, వైజాగ్ డ్రగ్స్ కేసులో బాలయ్య చిన్నల్లుడి పాత్ర ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్. వైజాగ్ డ్రగ్స్ కు నిలయంగా మారింది… అందులో టిడిపి ఎంపీ అభ్యర్థి భరత్ ప్రమేయం ఉందని….వైజాగ్ లో పట్టుబడిన డ్రగ్ వ్యవహారంలో టీడీపీ ప్రమేయం ఉందని సంచలన ఆరోపణలు చేశారు.
బాబు మోహన్ ను వరంగల్ నుండి పోటీ చేస్తారు, గెలిపించాలని కోరారు కేఏ పాల్. RS ప్రవీణ్ కుమార్ ఓ తుగ్లక్ అంటూ విరుచుకుపడ్డారు కేఏ పాల్. నల్లగొండ జిల్లాలో కేఏ పాల్ మాట్లాడుతూ….తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు 100 రోజులు పూర్తి అయినా.. 100 రూపాయల సంక్షేమం, అభివృద్ధి జరగలేదన్నారు. సాగు, తాగు నీటి సమస్య పరిష్కరించకపోతే సీఎం రేవంత్ రెడ్డి కి ఇబ్బందులు తప్పవు….తెలంగాణలో బీజేపీ భూస్థాపితం అయ్యిందని వెల్లడించారు.