నేను వరంగల్ బిడ్డనే..నాది గుంటూరు కాదు – కడియం కావ్య

-

నేను వరంగల్ బిడ్డనే..నాది గుంటూరు కాదన్నారు వరంగల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య. బీజేపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుందని… మీ పార్టీ విధానాలు మాట్లాడాలని వెల్లడించారు. నేను వరంగల్ బిడ్డనే…వరంగల్ లోనే చదువుకున్నానని వివరించారు వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య.

Kadiyam Kavya about her nativity

బిజెపి పార్టీ మనువాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆగ్రహించారు. మీ కళ్ళముందు పెరిగిన నేను గుంటూరు వాసిని ఎలా అవుతాను అని నిలదీశారు వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య. కాగా, వరంగల్ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న‌ డాక్ట‌ర్ క‌డియం కావ్యకు వ‌రంగ‌ల్‌తో ఉన్న సంబంధం ఏంటో చెప్పాలని అదే నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేశ్ డిమాండ్ చేశారు. కావ్య ఏపీకి చెందిన ముస్లిం మ‌హ‌మ్మ‌ద్ న‌జీరుద్దీన్‌ను ప్రేమించి పెళ్లాడింద‌ని, ఆమె కడియం కావ్య కాదని, మహమ్మద్ కావ్య నజీరుద్దీన్ అని ర‌మేశ్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version