హై టెన్షన్.. ఏ క్షణంలోనైనా కౌశిక్ రెడ్డి అరెస్టు !

-

హుజూరాబాద్ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊహించని షాక్‌ తగిలింది. హుజూరాబాద్ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి భారీగా చేరుకున్నారు పోలీసులు. దీంతో ఏ క్షణంలోనైనా కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ తరుణంలోనే… మరి కాసేపట్లోనే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లనున్నారు మాజీ మంత్రి హరీష్ రావు.

కాగా, కౌశిక్‌ రెడ్డిపై కేసు నమోదు అయింది. ఫోన్ టాపింగ్ పై ఫిర్యాదు చేయడానికి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ కు వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి పై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్‌ చేశారు. ఒక ప్రజా ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేసేందుకు వెనుకడుతరు, మళ్ళీ ఉల్టా కేసు బనాయిస్తరు ? అంటూ ఆగ్రహించారు. ఇదేం విడ్డూరం….ఇదెక్కడి న్యాయం? ఇదేం ప్రజాస్వామ్యం? రేవంత్ మీ పాలన మార్పు మార్కు ఇదేనా? అంటూ ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version