గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సీఎం జగన్, అతని తమ్ముడు మాజీ ఎంపీ అవినాశ్ కలిసి ముంబై మాఫియా వంటి నేర సామ్రాజ్యాన్ని స్థాపించారని, అందుకు కాకినాడ పోర్టు వేదిక అయ్యిందని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. ముంబై మాఫియా తరహాలో జగన్ గ్యాంగ్ సైతం బడా పారిశ్రామికవేత్తలను బెదిరించి ఐదేళ్లలో వేలకోట్ల వ్యాపారాలు, ఆస్తులు లాక్కున్నారని ఆరోపించింది.
వైఎస్ జగన్ అధికారంతో పాటు బాబాయ్ కొడుకు, గన్‌లూ రంగంలోకి దిగి కాకినాడ పోర్ట్, సెజ్‌లోని వాటాలను లాగేసుకున్నారని, ముంబై మాఫియా నుంచి ఆస్తులు తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చట్టం చేసేందుకు పరిశీలిస్తున్నామని సీఎం చంద్రబాబు గారు చెప్పడం..జగన్ నేరసామ్రాజ్యంపై ఉక్కుపాదం మోపడం ఖాయమనే సంకేతాలను ఇస్తోందని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.
ముంబై మాఫియా తరహాలో జగన్ గ్యాంగ్ బడా పారిశ్రామికవేత్తలను బెదిరించి ఐదేళ్లలో వేలకోట్ల వ్యాపారాలు, ఆస్తులు లాక్కున్నారు. జగన్ అధికారంతోపాటు బాబాయ్ సన్, గన్‌లూ రంగంలోకి దిగి కాకినాడ పోర్ట్, సెజ్ లో వాటాలు లాగేశారు. ముంబై మాఫియా నుంచి ఆస్తులు తిరిగి స్వాధీనం చేసుకున్న చట్టం… pic.twitter.com/qVOz2EeMgY
— Telugu Desam Party (@JaiTDP) December 5, 2024