కేసీఆర్ లాంటి జగమొండి తోనే అవన్నీ సాధ్యం – కవిత సంచలనం

-

ప్రజాస్వామ్యం కూని చేసే రాజకీయాలు దేశంలో నడుస్తున్నాయి..అవన్నీ తిప్పికొట్టాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యం కేసీఆర్ లాంటి జగమొండి తోనే సాధ్యమన్నారు కల్వకుంట్ల కవిత. తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు మేడే రాజీవ్ సాగర్. ఈ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కొంతమంది ఇష్టమచ్చినట్టు మాట్లాడుతున్నారు..ఉద్యమం సమయంలో ఈ మాటలు మాట్లాడే వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనకు తెలుసన్నారు.

నెత్తిమీద రూపాయి పెడితే అర్ధ రూపాయికి కూడా వాళ్ళని కోనరు అలాంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అవాక్కులు చేవాక్కులు పేలుతున్నారు..కేసీఆర్ తో కలిసి నడిచేవారికి మంచి రోజులు తప్పకుండ వస్తాయి ఆ నమ్మకం ఉంది…మనం అందరం సైద్ధాంతికరమైన రాజకీయాలు చేయాలి ఓట్ల రాజకీయాలు కాదని పేర్కొన్నారు. ఇక ముందు కూడా ఇలాగే కష్టపడి పనిచేయాలి దేశంలో మన పాత్ర కీలకంగా ఉండాలి ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట నడవాలి…పని చేసే కార్యకర్తలు సమయం కోసం వేచి చూడాలి తప్పకుండా గుర్తింపు లభిస్తుందన్నారు కవిత.

Read more RELATED
Recommended to you

Exit mobile version