మహిళా కలెక్టర్ కు తక్షణమే క్షమాపణలు చెప్పాలి – కవిత

-

మంత్రి పొంగులేటి, కాంగ్రెస్ పార్టీ మహిళా కలెక్టర్ కు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు కల్వకుంట్ల కవిత. ఈ మేరకు ట్విట్టర్ లో ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కరీంనగర్ కలెక్టర్ ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవమానించడాన్ని ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ నాయకుల అహంకారానికి పరాకాష్ట ఈ ఉదంతమే నిదర్శనం అంటూ ఫైర్ అయ్యారు కల్వకుంట్ల కవిత.

kavitha on pomguleti

ఇలాంటి సిగ్గుమాలిన వైఖరి ఆమోదయోగ్యం కాదని చురకలు అంటించారు కల్వకుంట్ల కవిత.. ఇది కేవలం కలెక్టర్ ను అవమానించడమే కాదు… మొత్తం అధికార యంత్రాంగాన్నే అవమానించినట్లు అన్నారు. మహిళా కలెక్టర్ కి మేము అండగా ఉన్నామని భరోసా ఇచ్చారు. మంత్రి పొంగులేటి, కాంగ్రెస్ పార్టీ మహిళా కలెక్టర్ కు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు కల్వకుంట్ల కవిత.

 

Read more RELATED
Recommended to you

Latest news