kalvakuntla kavitha: బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. కవిత జ్యూడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ తరుణంలోనే.. కవిత ను కోర్టులో హాజరు పర్చనున్నారు తీహార్ జైలు అధికారులు.
కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వనందున, జ్యూడిషియల్ రిమాండ్ పొడగించే యోచనలో కోర్టు ఉన్నట్లు సమాచారం. దీనిపై ఇవాళ మధ్యాహ్నం సమయానికి క్లారిటీ వస్తుంది. కాగా లిక్కర్ కేసులో కవిత కీలకంగా ఉన్నారు….డిజిటల్ ఆధారాలను కవిత ద్వంసం చేసిందని ఈడీ వెల్లడించింది. ఆమ్ ఆద్మి పార్టీకి హవాలా రూపంలో 100 కోట్ల ముడుపులు ఇచ్చారని… ఇండో స్పిరిట్ లో అరుణ్ పిళ్ళై ద్వారా కవిత 33 శాతం వాటా పొందిందని ఆరోపణలు ఉన్నాయి.