నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయడంపై BRS MLC కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. నిజామాబాద్ నుంచి నేను పోటీ చేయాలా ? లేదా ? అన్నది BRS నిర్ణయం తీసుకుంటుంది…నిజామాబాద్ నుంచి పోటీ చేయాలా లేదా చెప్పండన్నారు. మేము పడగొట్టడం కాదు…ఖమ్మం ,నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలే కాళ్లు పట్టుకుని లాగుతారని చురకలు అంటించారు. అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ ఇద్దామని రేవంత్ అనుకున్నారు…కానీ నల్గొండ నేతలు అడ్డుకున్నారు అన్నది అందరికీ తెలుసు అని సెటైర్లు పేల్చారు BRS MLC కల్వకుంట్ల కవిత.
రేవంత్ ను యూ టర్న్ ముఖ్యమంత్రి పిలవాలని BRS MLC కల్వకుంట్ల కవిత చురకలు అంటించారు. రేవంత్ సర్కార్ పబ్లిసిటీ ఎక్కువ అయ్యిందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నా మీద, జాగృతి పైన ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారు…ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి అనేక ఆరోపణలు నాపై చేశాడని నిప్పులు చెరిగారు కల్వకుంట్ల కవిత. పార్టీ సభకు ప్రభుత్వ నిధులు ఎందుకు వాడుతున్నారు…అధికారికంగా హెలికాప్టర్ వేసుకొని వెళ్లి పార్టీ సభ పెట్టారని ఆగ్రహించారు.
వేదిక, కుర్చీలు,లైట్లు పెట్టినందుకు ప్రభుత్వానికి లెక్కలు చెప్పారా? అని నిలదీశారు. మలి దశ ఉద్యమంలో అమరులైన అమరులకు కుటుంబాలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.