తెలంగాణ రైతులకు షాక్. వర్షాలతో మార్చిలో పంటలు నష్టపోయి రూ. 10,000 సాయానికి ఎంపికైన రైతులకు… రెండోసారి పంట నష్టపోతే పరిహారం ఇవ్వడం కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
మార్చి 16 నుంచి 21 వరకు వడగళ్ల వానలు పడటంతో సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటించి, ఎకరానికి 10,000 సాయం ప్రకటించారు. అయితే ఈ సాయం అందక ముందే మళ్ళీ వర్షాలు మొదలయ్యాయి.ఒక అటు రైతులను ఆదుకుంటామని అకాల వర్షాలపై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలపైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె. తారక రామారావు సిరిసిల్ల జిల్లా అధికారులతో సమీక్షించారు. అన్ని జిల్లాల కలెక్టర్ లతో పాటు, జిల్లా ఎస్పీ, జిల్లా వ్యవసాయ అధికారిలతో ఫోన్ లో మాట్లాడిన మంత్రి కేటీఆర్ పరిస్థితులపైన వివరాలు తీసుకున్నారు.