తెలంగాణ ఇరిగేషన్ ని కేసీఆర్ సర్వనాశనం చేశాడు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అప్పుల్లోకి ముంచాడు. కేటీఆర్, హరీశ్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అసలు వారికి మాట్లాడే అర్హతనే లేదన్నారు. రోజుకు 8 టీఎంసీలు నీటిని తరలిస్తుంటే.. ఏం చేశారని ప్రశ్నించారు. ఇంతకంటే కక్కుర్తి ఇంకేమైనా ఉందా అన్నారు.
కాళేశ్వరం పై 2 టీఎంసీల కోసం లక్ష కోట్లు ఖర్చు చేశాడు కేసీఆర్. తెలంగాణ పై, కృష్ణా నది నీటిపై కుట్రలు జరిగాయి. చర్చలకు రావాలని కేంద్ర ప్రభుత్వం పిలిస్తే.. కేసీఆర్ వెళ్లలేదు. కృష్ణా నది జలాలపై ఈ పదేళ్లలో జరిగిన అన్యాయం.. ఉమ్మడి ఏపీలో కూడా జరగలేదన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితిలో అప్పగించమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ హయాంలో వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క టీఎంసీ నీళ్లు కూడా తేలేదన్నారు. నీళ్ల విషయంలో కేసీఆర్ కుట్రలు చేశారు అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.