దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఎస్సీ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనంలో ఈతల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూమి ఇవ్వకపోగా పేదలకు ఉన్న భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. 10 లక్షల పరిహారం ఇచ్చి.. కోట్లకి అమ్ముకుంటున్నారని విమర్శించారు. కొండపాక కలెక్టర్ కార్యాలయం నిమిత్తం 25 ఎకరాల భూమి అవసరం అయితే.. 350 ఎకరాల భూమిని తీసుకొని మిగతా భూమిని ప్లాట్లుగా చేసి విక్రయించారు.
కెసిఆర్ పేదలను కొట్టి పెద్దలకు ఇస్తున్నారు పేద వాళ్లకు కోట్ల విలువ చేసే భూములు ఉండకూడదనే కేసీఆర్ అలా చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో చేసిన అభివృద్ధిని కూడా కేసీఆర్ తన ఖాతాలోకి వేసుకుంటున్నారని తెలిపారు. టిఆర్ఎస్ కన్వా వేసుకోకపోతే వారిని తెలంగాణ గడ్డమీద బతకనివ్వము కేసులు పెడతామని బెదిరించే పరిస్థితి ఏర్పడిందని ఈటెల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.