పాలేరు సాగు నీటి కష్టాలు తీర్చిన ఘనత కేసీఆర్‌దేనని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా హైదరాబాద్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన మీడియాలో సమావేశంలో మాట్లాడారు.పాలేరు నీటి కష్టాలు తీర్చాలంటే ఉమ్మడి ఏపీలో సాధ్యం కాలేదు. ఆనాడు ఉమ్మడి పాలనలో తాగడానికి నీళ్లు లేక చుట్టాల ఇంటికి పోయే పరిస్థితి ఉండేది.. ఇప్పుడు పాలేరు రూపురేఖలు మొత్తం మారిపోయాయి. ఆనాడు పశువులకు తాగడానికి నీళ్లు లేక ఊర్లు వదిలి వెళ్లిపోయే పరిస్థితి ఉండేది.
తెలంగాణ ఏర్పడిన తరువాత ఆనాడు సీఎం కేసీఆర్‌ను ఒప్పించి 76 వేల ఎకరాలకు సాగు నీరు వచ్చేలా చేశానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలనేది తన సంకల్పం అన్నారు. క్రెడిట్ కోసం పాకులాడే మనిషిని కాదన్నారు. మరోవైపు సీతారామ ప్రాజెక్ట్ పై హరీశ్ రావు వ్యాఖ్యలు హాస్యస్పదం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.